ఊరంతా ఓ గొడవైతే ఉలిపిరి కట్టది మరో గొడవ అన్నట్లు. ఈ సారి ఐపీఎల్ లో ఫెయిలవుతున్న టీమ్స్ వాళ్లు లేరు వీళ్లు లేరు అనే బాధలు ఉన్నాయి. కానీ అందరూ ఉన్నా ఫెయిల్ అవుతున్న టీమ్ ఏదన్నా ఉంది అంటే అది కోల్ కతా నైట్ రైడర్సే. ఎందుకుంటే నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచే ఉదాహరణ వాళ్లకు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు కూడా స్పెషలిస్ట్ బ్యాటరే ఉన్నాడు. ఆ స్థాయిలో ఆల్ రౌండర్లు, పించ్ హిట్టర్లతో నిండిపోయింది కోల్ కతా నైట్ రైడర్స్. కానీ నిన్న 199 పరుగుల చేజింగ్ చేయాలంటే ఆపసోపాలు పడ్డారు. రహానే మినహాయించి మిగిలిన బ్యాటర్లంతా జీటీ బౌలర్లు వేసే స్లో బంతులకు ఊగిపోతూ క్యాచ్ లు ఇచ్చుకోవటం..వికెట్లు సమర్పించుకోవటం అంతే. ఇదేం నిన్న మొదటి సారి కాదు ఈ సీజన్ లో లక్నో మీద 4 పరుగుల తేడాతో ఓడిపోవటం తప్ప ఒక్క క్లోజ్ మ్యాచ్ కూడా లేదు కేకేఆర్ కి. అన్నీ భారీ గా ఓడిపోవటమే నేర్చుకుంది. ఓపెనర్ సునీల్ నరైన్ దగ్గర మొదలు పెట్టి చివరాఖరి వచ్చే ఆండ్రూ రస్సెల్ వరకూ అందరూ ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేవాళ్లైనా సరే ఈ సీజన్ లో కేకేఆర్ ఆడుతున్న ఆటతో 111 పరుగులు ఛేజ్ చేసే పరిస్థితులు కనిపించటం లేదు. మ్యాచ్ విన్ అవ్వాలన్న కసి కూడా కానరావటం లేదు. గంభీర్ మెంటార్ గా ఉన్నప్పుడు గతేడాది ఉత్సాహం ఉరకలెత్తిన జట్టు ఇప్పుడు ఊసురో ఈసురో అంటోంది. చూడాలి మిగిలిన మ్యాచుల్లోనైనా కనీసం ఫైట్ బ్యాక్ అయినా కేకేఆర్ చేస్తుందేమో.